![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -307 లో..ముకుంద రెస్టారెంట్ లో గతంలో తమపై బెట్టింగ్ కట్టిన వ్యక్తిని చూసి ఎక్కడ దగ్గరకి వచ్చి మాట్లాడుతాడో అని టెన్షన్ పడుతుంది. ముకుంద టెన్షన్ పడడం కృష్ణ చూస్తుంది. తను కూడా అతన్నిచూస్తుంది. అతను వాళ్ళ దగ్గరకి వచ్చి.. ఆ రోజు మీతో ఉన్న సర్ ఎక్కడ అని అడుగుతాడు. దాంతో ముకుంద అతను ఎక్కడ నిజం చెప్తాడోనని అతనిపై కోపంగా అరిచి పంపిస్తుంది.
ఎందుకు అతనిపై అరుస్తున్నావని మురారి అడుగుతాడు. అతనికీ ఎప్పుడు టిప్పు ఇస్తుండేవాళ్ళం. అందుకే వచ్చి మాట్లాడుతున్నాడని ముకుంద కవర్ చేస్తుంది. నాకు ఏదో గుర్తుకు వస్తుందని మురారి అనగానే కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముకుంద మాత్రం టెన్షన్ పడుతుంది. మరొక వైపు భవాని దగ్గరకు రేవతి వచ్చి.. మీరు మురారిని అమెరికా పంపించడం నాకు ఇష్టం లేదని రేవతి అనగానే.. ఎందుకు నీ కోడలు ఉందని అంటున్నావా? అసలు తను ఉందనే పంపిస్తున్నానని భవాని అంటుంది. మురారికి ఆ సిచువేషన్ రావడానికి కారణం ఆ కృష్ణనే అని భవాని అనగానే.. నాకు ఎందుకో నమ్మాలనిపించడం లేదని రేవతి అంటుంది.
ఆ తర్వాత రేవతి మీ ఇష్టం. ఇప్పటివరకు మురారి మీ బిడ్డగానే పెరిగాడు. ఇప్పుడు కూడా ఇంతే అని రేవతి చెప్తుంది. దానికి భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ ముకుంద, మురారి ముగ్గురు వస్తారు. ముకుంద వచ్చి రేవతి భవాని ఇద్దరు మాట్లాడుకోవడం చూసి.. మురారి వింటాడెమోనని మురారి కృష్ణ ఇద్దరిని గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్తుంది.
మరొకవైపు భవాని కృష్ణ ఉండే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. భవాని వెళ్లేసరికి లోపల కృష్ణ, ముకుంద, మురారి మాట్లాడుకుంటు ఉంటారు. ఆ తర్వాత మురారిని ఫ్రెష్ అవ్వమని భవాని పంపిస్తుంది. మురారి, ముకుంద వెళ్ళగానే.. నువ్వు ఎక్సట్రా ఏమైనా చేస్తే ఇక్కడ కూడా ఉండవంటు కృష్ణకి భవాని వార్నింగ్ ఇస్తుంది. అక్కడే రేవతి ఎదరుపడుతుంది. ఏంటి నీ కోడలిని పలకరించడానికి వెళ్తున్నావా? నా మాట అంటే లెక్క లేదా అని రేవతిపై భవాని కోప్పడుతుంది. మరొక వైపు ముకుంద, మురారి ఇద్దరు కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. మరొక వైపు భవాని దగ్గరకు మురారి వెళ్లి.. మీరు వేణి డాక్టర్ ని ఎందుకు దూరం పెడుతున్నారని అడుగుతాడు. అవును దూరం పెడుతున్నామని భవాని చెప్తుంది. తరువాయి భాగంలో కృష్ణని మురారి గెస్ట్ హౌస్ నుండి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తే అందరూ షాక్ అవుతూ చూస్తారు. కృష్ణని భవాని లోపలికి రానిస్తుందా? లేక కృష్ణనే తన భార్య అని మురారికి గుర్తుకు రానుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |